calender_icon.png 26 December, 2024 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీఐ కేంద్రం వద్ద పత్తి రైతుల ధర్నా

08-11-2024 01:06:50 AM

తేమ పేరుతో కొనుగోళ్లను నిరాకరించడంపై మండిపాటు

నాగర్‌కర్నూల్, నవంబర్ 7 (విజయక్రాంతి): తేమ శాతం ఎక్కువగా ఉందన్న సాకుతో పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో పత్తి రైతులు ధర్నాకు దిగారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం రాంరెడ్డిపల్లి సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద గురువారం జరిగింది. రైతులు తెచ్చిన పత్తిని అధికారులు నామమాత్రంగా పరీక్షలు జరిపి తేమ శాతం ఎక్కువగా ఉందంటూ కొనుగోళ్లు నిలిపివేశారని రైతులు వాపోయారు.

దళారులు తెచ్చిన పత్తిని మాత్రం కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. దళారులు, అధికారులు కుమ్మక్కై తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రైతుల ధర్నాతో నాగర్‌కర్నూల్-అచ్చంపేట ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. తెలకపల్లి ఎస్సై నరేష్ సంఘటన స్థలానికి వెళ్లి రైతులకు సర్ది చెప్పారు.