calender_icon.png 26 December, 2024 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద పత్తి రైతుల ధర్నా

07-11-2024 03:03:05 PM

తేమ పేరుతో కొనుగోళ్లను నిరాకరించడంపై మండిపాటు

భారీగా ట్రాఫిక్ జామ్.. రంగంలోకి పోలీసులు

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): పత్తి కొనుగోలు చేసేందుకు తేమ శాతం ఎక్కువగా ఉందన్న సాకుతో పత్తి కొనుగోలను నిలిపివేయడంతో పత్తి రైతులు ఆగ్రహించి కొనుగోలు కేంద్రం ముందు ధర్నాకు దిగారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం రాంరెడ్డిపల్లి సిసిఐ కొనుగోలు కేంద్రం వద్ద చోటుచేసుకుంది. రైతులు పండించిన పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా అక్కడ అధికారులు నామమాత్రంగా పరీక్షలు జరిపి ఫేమస్ శాతం ఎక్కువగా ఉందంటూ కుంటి సాకులు చెప్పి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని రైతులు వాపోయారు. దళారులు ఇతరులు తెచ్చిన పత్తిని మాత్రం కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

వాతావరణంలో జరిగే మార్పులు కారణంగా తేమ శాతం హెచ్చు తగ్గులు అవుతోందని దానిని సాకుగా చూపి దళారులు అధికారులు కుమ్మక్కై రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడుతున్నారు. గ్రామాల్లోకి వచ్చే దళారులు మాత్రం తక్కువ ధరకే పత్తిని కొనుగోలు చేస్తున్నారని వారికి ఇష్టం వచ్చిన రీతిలో కాంట నిర్వహిస్తున్నారని తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు ధర్నా చేపట్టడంతో నాగర్ కర్నూల్ అచ్చంపేట ప్రధాన రహదారి పూర్తిగా ట్రాఫిక్ జామై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న తెలకపల్లి ఎస్సై నరేష్ సంఘటన స్థలానికి వెళ్లి రైతులకు సర్ది చెప్పారు. పత్తి కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు.