calender_icon.png 26 October, 2024 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ హాస్టల్స్ మెస్ చార్జీల పెంపు... సెప్టెంబర్ 2న కలెక్టరేట్ ఎదుట ధర్నా

29-08-2024 06:41:30 PM

కేవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్

దళితులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి

కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షురాలు మాచర్ల భారతి

ఖమ్మం, (విజయక్రాంతి): సంక్షేమ హాస్టల్స్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని, మెడికల్ క్యాంప్ లు పెట్టాలని, కనీస సౌకర్యాలు మెరుగు పరచాలని కోరుతూ కెవిపిఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ పిలుపునిచ్చారు. గురువారం కేవిపిఎస్ జిల్లా స్థాయి సమావేశం కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పాపిట్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ.. సాంఘీక సంక్షేమ హాస్టల్ యాత్ర కేవిపిఎస్ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించిందన్నారు.

విద్యార్థుల మెస్ చార్జీలు పెరిగిన ధరలకు సరిపోక నాసిరకం భోజనం పెడుతున్నారని చెప్పారు. హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు 2500రూ. లకు పెంచాలన్నారు. కాస్మొటిక్ చార్జీలు పెంచాలన్నారు విద్యార్థుల ప్యాకెట్ మణి 1000రూ. లు పెంచుతూ జీవో విడుదల చేయాలన్నారు. మెనూ అమలు, మెస్ చార్జీలు ప్యాకేట్ మని కోసం సెప్టెంబర్ 2న కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలన్నారు. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షురాలు మాచర్ల భారతి మాట్లాడుతూ... కాంగ్రేస్ ఎన్నికలకు ముందు దళిత గిరిజనులకోసం చేవెళ్ల ఎస్సి ఎస్టీ డిక్లరేషన్ కు ఏడాది గడిచిందని, ప్రభుత్వం ఏర్పడి 9నెలలు గడిచిందన్నారు. ప్రభుత్వం అంబేద్కర్ అభయహస్తం కోసం 2000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ప్రకటించారని కానీ ఆ పథకం అమలుకు మార్గదర్శకాలు రూపొందించలేదన్నారు.

దళితుల సమగ్రాభివృద్ధికి కాంగ్రేస్ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలన్నారు సాంఘీక సంక్షేమ మంత్రిని నియమించాలన్నారు. ఎస్సి ఎస్టీ కేసులలో బాధితులకు నష్టపరిహారం అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. తక్షణమే పెండింగ్ ఎక్స్ గ్రేషియో చెల్లించాలన్నారు 2018 సం.రం నుండి ఎస్సి కార్పోరేషన్ రుణాలు పెండింగ్ లో ఉన్నాయని, తక్షణమే పెండింగ్ రుణాలు విడుదల చేయాలన్నారు. సాంఘీక సంక్షేమ మంత్రి లేకుండా దళితుల సంక్షేమం గురించి కాంగ్రేస్ ప్రగల్భాలు పలుకుందని విమర్శించారు. ఈ సమావేశంలో కేవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొట్ల సాగర్, జిల్లా నాయకులు ఎస్ కె సైదులు, నాగటి సురేష్, కర్లకుంట నరేష్, బందేల కల్యాణ్, జెర్రిపోతుల కిరణ్, వెల్తురు రామనాధం తదితరులు పాల్గొన్నారు.