ఎమ్మెల్యే పల్లాపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్‌ఎఫ్
ఘట్‌కేసర్, ఆగస్టు 27: బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ స్థలంలో అక్రమంగా కళాశాలల భవనాలు నిర్మించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని నాడెం చెరువు బఫర్ జోన్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ సాయంతో బహుళ అంతస్తుల కళాశాల భవనాలు నిర్మించాడని ఆరోపించారు. ఇప్పుడు వాటిని హైడ్రా కూల్చివేస్తే విద్యార్థుల పరిస్థితి ఎమిటని ప్రశ్నించారు. అను రాగ్ విద్యా సంస్థల విద్యార్థుల భవిష్యత్తుకు యజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.