calender_icon.png 13 November, 2024 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణన బహిష్కరణకు పిలుపు

11-11-2024 09:23:50 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్టంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఈనాటి భద్రాద్రి జిల్లాలో బ్రిటిష్ ప్రభుత్వం - నిజాం ప్రభుత్వం నుండి అనాదిగా మన్యంలో స్థిర నివాసం ఉంటూ తాతలు ముత్తాతల నుండి నేటి వరకు పోడు భూములు సాగు చేస్తూ, అటవీ సంపదులు సేకరణపై ఆధార పడి జీవిస్తున్నాం. రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ ట్రైబుల్ చట్ట ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ లో ఆర్డర్ 1931, 1932, 1936, 1950, 1957, 1976, 2014 సంత్సరాల్లో గల చట్టాలు ప్రభుత్వం ఇచ్చిన జిఓలో ఏజెన్సీలో నివసిస్తున్న గౌడులు ఎస్టీ అని గిరిజన కులాల జాబితాలోని సీరియల్ నెంబర్ 7లో  నోమోదు చేసిన కుల సర్టిఫికెట్ ఇవ్వాలని ఏజెన్సి గౌడు సంఘ రాష్ట్ర అధ్యక్షులు నరాటి ప్రసాద్ ప్రభుత్వంని డిమాండ్ చేశారు.

సోమవారం ఏజెన్సీలో గల గౌడన్నలు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు నరాటి ప్రసాద్ మాట్లాడుతూ... తెలంగాణ పునర్విభజన చట్టం 2014లో ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ లో కూడా పై అంశం నమోదు చేసి ఏజెన్సీ గౌడ్ సీరియల్ నెంబర్ 7లో పొందిపర్చారు. ప్రస్తుతం 2024 సమగ్ర కులగణన సర్వే ఫామ్ లో కూడా గిరిజన కులాల జాబితాలో ఏజెన్సీ గౌడ్ ఎస్టీ అనే కాలంలో అనుబందం 8లో సీరియల్ నెంబర్ 7గా  ఉన్నది.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ గల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, గోదావరి జిల్లాలు, మన భద్రాచలం మన్యం గతంలో ఏజెన్సీ గౌడ్ లకు ఎస్టీ సర్టిఫికెట్లను అధికారులు జారీ చేశారు. మైదాన ప్రాంతంలో ఉన్న గౌడ్ లకు ఇస్తున్న బీసీ-బీ సర్టిపికెట్లు ఇస్తూ మన్యంలో అనాదిగా వుంటున్న ఎస్టీ హక్కును అధికారులు కాలరాస్తున్నారు. ఏజెన్సీ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా తగు ఆదేశాలు ఇవ్వాలన్నారు. 2024 కుల గణనలో ఏజెన్సీ గౌడ్ లకు గల కాలంలో ఎన్యుమెరేటర్స్ నమోదు చెయ్యకుండా ఇబ్బందులు పెడుతున్ననందున  ఉన్న స్వీయ ధ్రువీకరణ హక్కును కాల రాయకుండా తగు ఆదేశాలు ఇవ్వాలని విజ్నప్తి చేశారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పాటిల్ కి వినతి పత్రం అందించారు. కుల ఘనన లో సర్వే అధికారులు ఎస్ టి గా నమోదు కి అడ్డుపడుతున్న నేపథ్యంలో జిల్లా లో ఏజెన్సీ గౌడు లు ఎవరూ సర్వే ను ఆదుకోవాలి అని ప్రసాద్ పిలుపు నీచ్చారు. ఈ కార్యక్రమం గౌడు సంఘ జిల్లా నాయకులు కాసుల శ్రీనివాస్, రాజు గౌడు,రావుల సోమయ్య, కొండం వెంకన్న, బొర్రా వెంకటేశ్వర్లు,రేసు ఎల్లయ్య, ఉదయ్, వెంకన్న, రాంబాబు శ్రీను, పుల్లయ్య, సైదులు,  తదితరులు పాల్గొన్నారు.