calender_icon.png 19 January, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాసు పుస్తకాల కోసం ధర్నా

05-07-2024 12:11:57 AM

యాదాద్రి భువనగిరి, జూలై 4 (విజయక్రాంతి): తాము సాగు చేసుకుంటున్న వ్యవసామ భూములకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయకపోవడంతో బ్యాంక్ రుణాలు, రైతుబంధు ప్రయోజనాలు పొందలేకపోతున్నామని, తక్షణమే పాసుపుస్తకాలు మంజూరు చేయాలని సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని పీసీ తండాకు చెందిన రైతులు చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పీసీ తండాలోని 273, 192 సర్వే నంబర్లలో సేద్యం చేసుకుంటున్న రైతులకు కొత్త పాసు పుస్తకాలు జారీ చేయలేదు. దీంతో గత కొన్నేండ్లుగా వారు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం సైతం ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి తమకు న్యాయం చేయాలని ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.