25-02-2025 12:00:00 AM
ఖమ్మం, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్ లు చేస్తూ అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న నారాయణ, శ్రీచైతన్య ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి పిడిఎస్‌యూ రాష్ర్ట కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నారాయణ కాలేజీ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ర్ట సహాయ కార్యదర్శి వెంకటేష్, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ర్టవ్యాప్తంగా విద్యా పూర్తిగా వ్యాపారమయమైందని, గల్లి గల్లికి మోడల్ స్కూల్స్, ఈ టెక్నో, ఫౌండేషన్, ఈ-టెక్నో, డిజీ, మెడిసిన్, ఐఐటి ఫౌండేషన్, సివిల్స్ లాంటి పేర్లు తగిలించుకొని యదేచ్చగా లక్షల్లో ఫీజులు వసూళ్లకు పాల్పడుతుంటే సంబంధిత విద్యాశాఖ అధికారులు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయి ఆవేదనవ్యక్తం చేశారు.
ముందస్తు అడ్మిషన్లకు పాల్పడుతున్న పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పిడిఎస్‌యూ ఆధ్వర్యంలో ఉద్యమం చెపడతామన్నారు. పిడిఎస్‌యూ జిల్లా జిల్లా నాయకులు వినయ్, సాధిక్, యశ్వంత్, నసీర్, అశోక్, అన్వేష్, గణేష్, మహేష్, రాజేష్, నరేందర్, రవి పాల్గొన్నారు.