08-02-2025 05:49:26 PM
కార్మికులపై కుర్చీ, చేతులు ఎత్తడం ఏంటి..?
అభివృద్ధికి కార్మికుడు కూడా తన బాధ్యత నిర్వహిస్తుండు..
మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మున్సిపల్ కార్మికులు..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మున్సిపల్ పరిధి అంతా పరిశుభ్రంగా ఉండేందుకు గాను కార్మికులు కూడా ఎంతో శ్రమిస్తున్నారని.. కార్మికునికి ఇవ్వవలసిన మర్యాద ఇవ్వవలసిందేనని సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ కమిషనర్ తన పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, సమ్మె కైనా సిద్ధమవుతామని హెచ్చరించారు.
కార్మికుల పట్ల అసభ్యంగా అశ్లీలంగా కించపరిచే మాటలు కార్మికులపై చేయి ఎత్తడం, కుర్చీ లేపడం, ప్రజల ముందే అవమానపరచడము. ఇలాంటివి మానుకోపోతే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఎంతోమంది కమిషనర్లను కార్మికులు చూశారని, సావధానంగా నచ్చజెప్పి పనులు చేయించాల్సిన అధికారి పోలీస్ అధికారులను మించి వ్యవహరించడం తగదని, ఆయన తన వైఖరి మార్చుకొని కార్మికులను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు.
చీమల కంటే హీనంగా చూస్తున్నావు..
మున్సిపల్ చరిత్రలోనే ఎన్నడూ ఎరగని ఘటనలు కార్మికులు ఎదుర్కొంటున్నారని, ఆధిపత్య భావజాలంతోనే వల్గర్ మాటలు దూషణలు, దుర్మార్గ విధానాలు కమిషనర్ మానుకోవాలని సిఐటియు రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్ చీమల కంటే హీనంగా చూస్తున్నారని, ఇది సరైన విధానం కాదని BBహెచ్చరించారు. కార్మికులను చీమల కన్నా అద్వానంగా కమిషనర్ చూస్తున్నాడని, ఎస్సీ ఎస్టీ ,బీసీ కార్మికులైనందువల్లె కించపరచడం, అవమానపరచడము, బెత్తం ఎత్తడం లాంటి పనులు చేస్తున్నాడని కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా అపరిస్కృతంగా పెట్టాడని, సమస్యలు పరిష్కరించని కమిషనర్ కార్మికుల పట్ల దురుసుగా వ్య వహ రించడం మానుకో పోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల వెంకటేశు, ఎర్ర నరసింహులు సిఐటియు జిల్లా కోశాధికారి చంద్రకాంత్, టౌన్ కార్యదర్శి రాజ్ కుమార్, భవనిర్మాణ కార్మిక జిల్లా కార్యదర్శి వరద గాలన్న, మున్సిపల్ యూనియన్ నాయకులు ప్రభాకర్, బాలరాజు తదితరులు ఉన్నారు.