16-04-2025 01:16:41 AM
పాకిస్థానీ చేతిలో హతం
జగిత్యాల, ఏప్రి ల్ 15 (విజయ క్రాంతి): ఉపాధి నిమిత్తం గల్ఫ్ బాట పట్టిన ధర్మపురి నివాసి దుబాయ్‌లో హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దుబాయ్‌లోని ఓ బేకరీ లో పనిచేస్తున్న తెలంగాణవాసిని పాకి స్థాన్‌కు చెందిన మతోన్మాది శుక్రవారం హత్య చేసినట్లు తెలిసింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన స్వర్గం శ్రీనివాస్(43) గత 20 ఏళ్లుగా భీవం డీ, ముంబై, దుబాయ్ వెళ్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఏడాది క్రితం దుబాయ్ వెళ్లిన శ్రీనివాస్ మరో 4 నెలల్లో స్వగ్రామా నికి రావల్సి ఉన్నట్టు తెలెసింది.
అయితే గత శుక్రవారం శ్రీనివాస్ పనిచేసే దుబాయ్ లోని బేకరీ వద్ద జరిగిన గొడవలో శ్రీనివా స్‌తోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో వ్యక్తిని పాకిస్థాన్ ఉన్మాది హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో నిర్మల్ కు చెందిన మరో వ్యక్తి గాయపడ్డట్టు తెలిసిం ది. మృతుడు శ్రీనివాస్ స్వగ్రామం దమ్మన్నపేటలో తల్లి లక్ష్మి ఒంటరిగా ఉం టుంది. శ్రీనివాస్ భార్య మంజుల, కుమారు లు చందు, సూర్య ముగ్గురు కరీంనగర్‌లో ఉంటున్నట్లు సమాచారం. చందు డిగ్రీ చదువుతుండగా, సూర్య టైల్స్ వర్క్ చేస్తున్న ట్లు తెలిసింది. భార్య, కుమారులతో శ్రీనివా స్‌కు మధ్య కొంతకాలంగా విభేదాలున్నట్లు సమాచారం.