గజ్వేల్,(విజయక్రాంతి): గజ్వేల్ పట్టణంలో ఆదివారం నిర్వహించనున్న ధర్మ జాగృతి సభను విజయవంతం చేయాలని హిందువులకు బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. నా దేశం నా ధర్మం, సనాతన బోర్డే మన లక్ష్యం అన్న నినాదంతో అన్ని హిందూ ధార్మిక సంఘాల ఆద్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్మ జాగృతి మహా సభకు చిన్న, పెద్ద, యువతి, యువకులు, హిందూ బందువులందరూ కదలిరావాలని, హైందవ ఐక్యతను చాటాలని బిీజేపీ నాయకులు బారు అరవింద్, నాయిని సందీప్ కోరారు.