* ధర్మంపై అవగాహన లోపంతోనే హింస
* అసంపూర్ణ జ్ఞానంతో అధర్మానికి మార్గం
* ధర్మాన్ని సక్రమంగా బోధించాలి
* ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
అమరావతి, డిసెంబర్ 23: ధర్మం (మతం) పేరుతో జరగుతున్న అణిచివేతలు, హింస, దౌర్జన్యాలు అన్నీ కూడా ధర్మంపై అవగాహన లేకపోవడం వల్లే జరుగుతున్నాయని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మహారాష్ట్రలోని అమరావతిలో జరుగుతున్న ‘మహానుభావ ఆశ్రమ’ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. ధర్మం చాలా ముఖ్యమైనదని, దానిని సరిగా బోధించాలని సూచించారు. ధర్మానికి ప్రతి మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉం దని, అందుకే దానిపై సరైన అవగాహన కలి గి ఉండాలన్నారు.
ధర్మం ఎప్పటి నుంచో ఉందని, అన్నీ దాని ప్రకారమే పనిచేస్తాయ ని.. అందుకే దానిని ‘సనాతనం’(శాశ్వతం) అని పిలుస్తారని తెలిపారు. ధర్మం గురించి అసంపూర్ణ జ్ఞానం కలిగి ఉండడం అధర్మానికి దారి తీస్తుందని హెచ్చరించారు. ప్రపం చవ్యాప్తంగా మతం పేరుతో జరుగుతున్న అణిచివేతలు, ఆకృత్యాలు వాస్తవానికి మతంపై అవగాహన లేకపోవడం వల్లే జరిగాయని ఆయన పేర్కొన్నారు. ధర్మ ప్రవర్తనే ధర్మానికి రక్షణ అని ఆయన అన్నారు.
ధర్మా న్ని ఆచరించేవాడే ధర్మాన్ని, మతాన్ని అర్థం చేసుకోగలడని వివరించారు. అయితే ధర్మా న్ని అందరూ అర్థం చేసుకోవాలని, అయితే ఈ కాలంలో అహంకారంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు దానిని అర్థం చేసుకోవడం కష్టమన్నారు. మిడిమిడి జ్ఞానంతో గర్వించే వ్యక్తికి బ్రహ్మ దేవుడు కూడా వివరించల లేడని పేర్కొన్నారు. ధర్మాన్ని ఆచరించడం ద్వారానే అర్థం చేసుకోవాలని, దానిని ఎల్లప్పుడు మననం చేసుకుంటూనే ఉండాల న్నారు.
ధర్మం ఏది కాంక్షిస్తుందో ఆ పనిని చేస్తూ వెళ్లాలని సూచించారు. జ్ఞానోదయమైన మార్గంలో ప్రయాణిస్తున్న వారే ఈ దేశానికి గర్వకారణమని ప్రకటించారు. ఎంతటి ప్రతికూల పరిస్థితులోనూ మహానుభావుల కృషి కొనసాగుతూనే ఉంటుందన్నా రు. ఐక్యతే శాశ్వతంగాత ఉంటుందని, ఇది ప్రపంచం మొత్తానికీ వర్తిస్తుందన్నారు. హిం సకు తావు లేకుండా ధర్మ రక్షణ చేయాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మాన్ని, సంస్కృతిని పరిరక్షించే మహత్తర కార్యాన్ని దేశ వ్యాప్తంగా మహానుభావులు కొనసాగిస్తూనే ఉన్నారని తెలిపారు. ధర్మాన్ని రక్షించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ తీవ్రంగా కృషి చేస్తోందన్నారు.
నిజమైన సంకల్పంతో పనిచేస్తే అది కచ్చితంగా పూర్తవుతుందన్నారు. ధర్మాన్ని సరి గ్గా ఆకళింపు చేసుకోవడం వల్లే సమాజంలో శాంతి, సామరస్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. మానవాళికి సేవ చేయడమే ధర్మం ముఖ్య ఉద్దేశమన్నారు. హింస, దురాగతాలను ధర్మం ఎన్నడూ ప్రోత్సహించదని చెప్పారు.
కాగా శుక్రవారం పూణెలో ‘ఇండియా ది విశ్వగురు’ అనే కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ ప్రస్తుతం మందిర్ వివాదాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రామమందిరం నిర్మాణం తరువాత కొంతమంది ఇలాంటి వివాదాలను బయటకు తీసి తాము కూడా హిందూ నాయకు లం కావొచ్చాని అనుకుంటున్నారని..కానీ ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కలుపుగోలు సమాజాన్ని ఆయన సమర్థించారు. మనదేశం సామరస్యంగా ఉంటుందనే విషయాన్ని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందన్నారు. తాము హిందువులం కాబట్టే రామకృష్ణ మిషన్‌లో కూడా క్రిస్మస్ వేడుకలను చేసుకుంటున్నామన్నారు.