calender_icon.png 23 April, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధరణి ఇబ్బందులు.. భూభారతితో దూరం

23-04-2025 01:11:35 AM

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

చందుర్తి, ఏప్రిల్ -22 (విజయక్రాంతి): ధరణి చట్టంతో రైతులు, ప్రజలు పడ్డ ఇబ్బందులు నూతన భూభారతి చట్టంతో దూరం కానున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి చట్టంపై రుద్రం గిలో అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, అది శ్రీనిబాస్ హాజరై . 

మాట్లాడుతూ ధరణి చట్టం రావడం తో రైతులు, ప్రజలు ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. గత పదేండ్లు అసైన్డ్ కమిటీ లేకపోవడంతో ఇంకా చాలా కష్టాలు పడ్డారని వివరించారు. ధరణి ఇబ్బందులు దూరం చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర మంత్రులు, నిపుణులు, అధికారులు భూ భారతి చటా ్టన్ని రూపొందించారని తెలిపారు.

భూముల విషయంలో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆశయమని స్పష్టం చేశారు. అతి తక్కువ కాలంలోనే భూ భారతి చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తున్నారని తెలిపారు వీటిలో ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఎదురైతే వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నామని వెల్లడించారు.

రైతును రాజును చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశమని, ఇందులో భాగంగానే రుణ మాఫీ చేసిందని తెలిపారు. దాదాపు రూ. 20 వేల కోట్ల రుణ మాఫీ చేసిందని వెల్లడించారు. సన్న రకం ధాన్యం పండించే రైతులకు క్వింటాల్కు అదనంగా రూ ఐదు వందలు ప్రభుత్వం అందజేస్తుందని తెలి పారు. పెద్దపల్లి జిల్లాలోని రైతులు దీని ద్వారా దాదాపు రూ. 32 కోట్ల లబ్ది అదనంగా పొందారని విప్ వెల్లడించారు.

సన్న రకం ధాన్యం తో సన్న బియ్యం పేదలు సద్వినియోగం చేసుకుంటూ ఆనందంగా ఉన్నారని తెలిపారు. భూభారతి చట్టం.. రైతుల చుట్టమని వివరించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ధరణి చట్టం.. భూభారతి చట్టంలోనీ వివరాలు, బేధాలను, లాభాలను వివరించారు. జిల్లాలోని అర్హులైన వారందరీ భూ సమస్యలు భూ భారతి చట్టంలో భాగంగా పరిష్కరిస్తామని, హక్కులు పంపిణీ చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు.క్షేత్ర స్థాయిలో నెలకొన్న భూ సమస్యలకు భూ భారతి ద్వారా శాశ్వత పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. మనుషులకు ఆధార్ నెంబర్ మాదిరిగా భూములకు భూధార్ నెంబర్ ఇస్తారని వెల్లడించారు. సదస్సు అనంతరం స్థానిక రైతులు, ప్రజల సమస్యలు విని, దర ఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, చందుర్తి తాసిల్దార్ శ్రీనివాస్, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.