calender_icon.png 30 March, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధరణి x భూభారతి భూపోరాటం!

27-03-2025 12:45:14 AM

  1. భూభారతి కాదు భూహారతి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా
  2. ధరణి దుర్మార్గచట్టం.. అందుకే బంగాళాఖాతంలో వేశాం: డిప్యూటీ సీఎం భట్టి
  3. ధరణితో మీరు.. భూభారతితో మేము.. ఎన్నికలకు వెళ్దామా?: రెవెన్యూ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): అసెంబ్లీలో ధరణి, భూభారతి చట్టాలపై బుధవారం జరిగిన చర్చ వాడీవేడిగా జరిగింది. నువ్వా.. నేనా.. అంటూ అధికార, ప్రతిపక్షసభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇటు బీఆర్‌ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరస్పరం విమర్శించుకున్నారు.

తొలుత పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం జమాబందీ పేరుతో ప్రభుత్వం మరో దుకాణం తెరిచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి కాదని, అది భూహారతి అని ఆరో పించారు.1.56లక్షల ఎకరాలకు ఈరోజు కూడా ధరణి ద్వారానే పాస్‌పుస్తకాలు ఇస్తున్నారని తెలిపారు.

భూభారతి చట్టం తో అనుభవదారుల కాలం తీసుకొచ్చారన్నారు. మీరు భూభారతితో అధికా రంలోకి రాలేదని, 420 హామీల ద్వారా వచ్చారని ఎద్దేవా చేశారు. ధరణిలో వివరాల ఆధారంగానే ఇప్పటికీ పథకాలు అమలు చేస్తున్నారని.. ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేస్తామన్న కాంగ్రెస్ దాన్ని అమ లు చేయాలని పల్లా డిమాండ్ చేశారు. 

ధరణి వద్దని ప్రజలు తీర్పు చెప్పారు: మంత్రి పొంగులేటి

ధరణి వద్దని ఓటుతో ప్రజలు తీర్పునిచ్చారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పబ్లిక్ డొమైన్‌లో పెట్టి, అన్ని వర్గాలతో చర్చించాకే భూభారతి తెచ్చామని స్పష్టంచేశారు. భూభారతిపై బీఆర్‌ఎస్‌కు మాట్లాడే నైతి క హక్కేలేదని మండిపడ్డారు. భూభారతితో వచ్చే ఎన్నికలకు తాము వెళ్తామని.. ధరణి పేరుతో బీఆర్‌ఎస్ నేతలు ఎన్నికలకు వెళ్లాలంటూ సవాల్ విసిరారు. 

సివిల్స్ అభయహస్తం పేరుతో ఇతర రా ష్ట్రాల్లో ప్రభుత్వ డబ్బులతో పత్రిక ప్రకటనలు ఇచ్చినట్లు నిరూపిస్తారా? అని సవాల్ విసిరారు.  బీఆర్‌ఎస్ ప్రభుత్వం తన హయాంలో ఐఅండ్‌పీఆర్ సంస్థను తమ జేబు సంస్థగా మలుచుకుందని విమర్శించారు. ఈ విషయాల పై చర్చకు సిద్ధమా అని పొంగులేటి సవాల్ చేశారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడే టప్పు డు జోక్యం చేసుకొని మంత్రులు మాట్లాడటంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం  ప్యానల్ స్పీకర్ రేవూ రి ప్రకాశ్ రెడ్డి బదులిస్తూ మంత్రులు కోరి తే మైకు ఇవ్వాల్సి ఉంటుంది, అది మీకు కూడా తెలుసని కేటీఆర్‌కు సూచించారు. 

భూమిపై హక్కులు లేకుండా చేశారు: డిప్యూటీ సీఎం భట్టి

ధరణి దుర్మార్గమైన చట్టమని, అందుకే బంగాళాఖాతంలో వేశామ ని, ఆ చట్టంతో వారికి కావాల్సిన వారి పేర్లపై భూములు ఎక్కించారని డిప్యూటీ సీఎం భట్టి విమర్శించారు. ప్రజల సమక్షంలో జమాబందీని చేయడం కరెక్టా.. నాలుగు గోడల మధ్య చేయడం కరెక్టా అని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక పట్టాదారు కాలమ్ పెట్టి, సాగుకాలం ఎత్తేసి దుర్మార్గమైన ధరణి చట్టం తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్యుపేషన్ కాలమ్ ఎత్తేసి.. పట్టాదారులకు అవకాశం కల్పించి తిరిగి జాగీ ర్దార్లు, జమీందారులకు భూహక్కులకు అవకాశం కల్పించారని విమర్శించారు.