calender_icon.png 25 September, 2024 | 12:01 PM

ధరణి స్థానంలో భూమాత తెస్తాం

25-09-2024 01:04:45 AM

  1. నల్లగొండకు రెండు తహసీల్ కార్యాలయాలు
  2. మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో భూసమస్యల పరిషార్కా నికి ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌ను తీ సుకొస్తామని రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ పట్టణంలోని త హసీల్దార్ కార్యాలయంలో మంగళవారం 117 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన అనంతరం మీడియా తో మాట్లాడారు.

ధరణి సమస్యల పరిష్కార ంలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా ముందుందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాం నుంచి జిల్లాలో 27 వేల ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా కలెక్టర్ చొరవతో ఇప్పటికే 23 వేలు పరిష్కారమయ్యాని పేర్కొన్నా రు. మిగిలిన వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

నల్లగొండ జనాభా 2 లక్షలు మించడం, రెవెన్యూ గ్రా మాలు అధికం కావడంతో ప్రస్తుత తహసీల్ కార్యాలయంపై ఒత్తిడి పెరుగుతున్నదన్నారు. నల్లగొండ పట్టణం, గ్రామీణ ప్రాంతాలకు వేర్వేరు కార్యాలయాల ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డిని ఆదేశించారు. ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయాన్ని రూ.25 లక్షలతో ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు.