రాజకీయాలకు అతీతంగా రౌండ్ టేబుల్ బేటీ నిర్వహించాం
గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కావద్దు
హైదరాబాద్: రాజకీయాలకు అతీతంగా రౌండ్ టేబుల్ భేటీ నిర్వహించామని ధరణి అధ్యయన కమిటీ అధ్యక్షుడు కోదండరెడ్డి గురువారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశం అన్నారు. ధరణి విషయమై అన్ని పార్టీల ప్రతినిధులతో చర్చించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలు సరిచేయడానికి కమిటీ వేశామని కోదండరెడ్డి తెలిపారు. గతంలో ఉద్దేశపూర్వకంగా భూములను నిషేధిత జాబితాలో పెట్టారని ఆయన పేర్కొన్నారు.మరోసారి భూసామ్య వ్యవస్థ తీసుకురావడానికి ప్రయత్నించారన్నారు.