25-03-2025 12:56:13 AM
జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్
జగిత్యాల, మార్చి 24 (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా ధరణి సమస్యల గురించి రైతులు సమర్పించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించా లని జగిత్యాల కలెక్టర్ బి.సత్యప్రసాద్ సూచించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ బిఎస్.లత సోమవారం ఆర్డీవోలు, తహసిల్దార్లు, సంబంధిత సిబ్బందితో ధరణి సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల వారిగా రైతులు సమర్పించిన ధరణి సమస్యల దరఖాస్తుల వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్లో వున్న అన్ని దరఖాస్తులను ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే రానున్న రబీ ప్యాడి సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కావలసిన అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆయా మండలాల పరిధిలోని ఐకెపి కేంద్రాలను సందర్శించి, కావలసిన సౌకర్యాలు కల్పించాలని ఆర్డీవోలు, తహసిల్దార్లను కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు.