calender_icon.png 16 March, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు రక్షణ కవచం ‘ధరణి’

22-12-2024 01:07:05 AM

* భూ భారతి ఒక తిరోగమన చర్య 

* ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): తెలంగాణ రైతుకు రక్షణ కవచం లాంటి ధరణితో ఆటలాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వా న్ని చరిత్ర క్షమించదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రజలు వెంటబడి ధరణిని మళ్లీ సాధించుకుంటారని, భూ భారతి ఒక తిరోగమన చర్య అని అభివర్ణించారు. భూ భారతి చట్టంతో భూ హారతి అయ్యేట్టు కనిపిస్తుందని, భూమాత పోర్టల్ భూమేతకే దారి తీస్తుందన్నారు. శనివారం శాసనమండలిలో భూ భారతి బిల్లుపై ఆమె మాట్లాడు తూ బీఆర్‌ఎస్ అంటే.. భూ రక్షణ సమితి అ ని రైతులు, ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. 

ధరణిలో కుట్ర కోణం ఉందని ప్రభు త్వం చెప్పడం దారుణమని, మాతృభూమి కోసం సైనికుడు ప్రాణమిస్తే.. సాగు భూమి కోసం రైతు ప్రాణమిస్తాడని వివరించారు. తె లంగాణలో 2.8 కోట్ల ఎకరాల భూమి ఉండ గా.. అందులో 1.5 కోట్ల ఎకరాలు సాగు భూమి ఉంటే 17.8 లక్షల ఎకరాలు మాత్ర మే వివాదాల్లో ఉందన్నారు. గతంలో కౌలుదారులు కేసులు వేస్తే 25 ఏళ్లపాటు రైతులు కోర్టుల చుట్టూ తిరిగే వారని.. అన్నీ ఆలోచించి రైతుకు మాత్ర మే భూమికి యాజమన్య హక్కు ఉండేలా కేసీఆర్ ధరణిని తీసుకొచ్చినట్టు గుర్తు చేశారు. ధరణి రాకతో ఒక్క గుంట ప్రభుత్వ భూమి కూడా అన్యాక్రాంతం కాలేదని స్ప ష్టం చేశారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ 42 ని మిషాల్లోనే జరిగిందన్నారు.

భూరికార్డులు, యజమానుల పేర్లు స్పష్టంగా ఉండటంతో 66 లక్షల మందికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు అందించిందన్నారు. భూదాన్, అట వీ, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కా కుండా ఉండేందుకు పార్ట్ చేర్చామని, పల్లెలు ప్రశాంతంగా ఉండాలంటే ఎంజాయ్‌మెంట్ సర్వే చేయొద్దని ప్రభుత్వానికి సూ చించారు. ఎవరూ ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా పాస్‌బుక్‌లు ఉంటే భూధార్ కార్డు ఎందుకని ప్రశ్నించారు. భూ భారతిలో కౌలుదారులు, అనుభవదారుల కాలమ్ పెట్టే ఆలోచనను విరమించుకోవాలని, కౌలు రైతులను మరోలా ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు.