calender_icon.png 26 October, 2024 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక వడ్డీ పేరుతో భారీ మోసం

08-07-2024 07:52:57 PM

హైదరాబాద్ : తమ వద్ద పెట్టుబడి పెడితే అధిక వడ్డీలు, లాభాలు ఇస్తామని నమ్మించి రూ.514 కోట్లు డిపాజిట్లు సేకరించిన ఇంటర్నేషనల్ ధన్వంతరి ఫౌండేషన్ ఛైర్మన్ కమలాకర్ శర్మను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కమలాకర్ శర్మ పేరు మీద ఉన్న ఆస్తులను అటాచ్ చేసి ఫౌండేషన్ లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ప్రచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ధన్వంతరి ఫౌండేషన్ లో భారీగా పెట్టుబడులు పెట్టిన పులువురు బాధితులకు ప్లాట్లను ఇప్పిస్తామని చెప్పి ఫౌండేషన్ ఛైర్మన్ కమలాకర్ శర్మ కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దాదాపు 4 వేల మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని భారీగా డబ్బులు వసూలు చేశారు. సీసీఎస్ డీసీపీ శ్వేతారెడ్డిని కలిసిన 200 మంది బాధితులకు సీజ్ చేసిన ఆస్తులు అమ్మి డిపాజిట్లు  తిరిగి ఇచ్చేలా చూస్తామని డీసీపీ హామి ఇచ్చారు.