calender_icon.png 19 October, 2024 | 4:03 PM

‘కుబేర’లో ధనుష్ ఇలా కనిపిస్తాడు!

29-07-2024 12:05:00 AM

శేఖర్ కమ్ముల, ధనుష్, నాగార్జున క్రేజీ కాంబోలో వస్తున్న పాన్ ఇండి యా చిత్రం ‘కుబేర’. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటిం గ్ జరుపుకొంటోంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, జిమ్ సర్బ్ కీలక పాత్ర లో కనిపించనున్నారు. మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలోని ప్రధాన పాత్రలను మేకర్స్ ఇప్పటికే పరిచయం చేశారు. ఆదివారం ధనుష్ పుట్టిన రోజును పురస్కరించుకొని చిత్రంలో ఆయన పాత్రకు సంబంధించి పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. నటుడిగానే కాదు, ‘రాయన్’ను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించటం ద్వారా ప్రేక్షకుల మన్ననలందుకుంటున్న ధనుష్ పెర్ఫార్మెన్స్ ‘కుబేర’లో నెక్స్ లెవల్‌లో ఉండనుందట.