బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం ధనుర్మాసం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరాంబట్ల వేణుగోపాల శాస్త్రి ఆలయంలో గత ప్రవచనాన్ని చదివి వినిపించారు. అనంతరం కోనేటిలో మహిళలు ధనుర్మాస దీపాలను వెలిగించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బుగ్గ రాజేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ చైర్మన్ మాసాడి శ్రీదేవి పాల్గొన్నారు.