...ఘనంగా ధమ్మ చక్ర పరివర్తన దినోత్సవం
.... జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): డా.బాబా సాహెబ్ అంబేద్కర్ బౌద్ధ దీక్ష తీసుకున్న దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఘనంగా ధమ్మ చక్ర పరివర్తన దినోత్సవన్ని జిల్లా కేంద్రంలో నిర్వహించారు. లుంబిని దీక్ష భూమి నుండి పటంలోని ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బౌద్ధ మతాచార్యులు, పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ... బుద్దుని బోధనలు ప్రతీ ఒక్కరికీ అచరణీయం అని తెలిపారు. బుద్దుని బోధనలతో ప్రపంచం అంత శాంతి సౌభాగ్యం తో విరజిల్లుతున్నదని కొనియాడారు. బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితమే శాస్త్రీయ దృక్పథం, మానవతా దృక్పథం, మానవ జీవితం సార్థకత గురించి బోధించి ఉన్నారని తెలిపారు.
చిన్నారులు సైతం అంబేద్కర్ పాటల పై నృత్య ప్రదర్శనలు చేశారు.తదనంతరం వివిధ గ్రామాల నుండి విచ్చేసిన బౌద్ధ అనుయాయులు, సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని ప్రతిజ్ఞలు చేశారు. రాత్రి మహారాష్ట్ర కు చెందిన కళాకారులచే కవ్వాలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జై భీం సేనా అధ్యక్షులు వినోద్ జాడే, సభ్యులు అశోక్ జాడే,అనిల్ దుర్గే,రవిదాస్, జనార్ధన్ తో పాటు సెంటర్ కమిటీ, లుంబిని దీక్ష భూమి కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల నుండి విచ్చేసిన బౌద్ధులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.