calender_icon.png 2 October, 2024 | 12:51 AM

హిందీలో ధమ్ తు దికాజా అంటూ..

29-09-2024 01:30:58 AM

హీరో రామ్‌చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీశ్ నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వాని హీరోయిన్. 2024 క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.

తెలుగు, తమిళంలో ‘రా మచ్చా మచ్చా..’ అంటూ అలరించనున్న ఈ పాట సాహిత్యం హిందీలో ‘ధమ్ తు దికాజా..’ అంటూ సాగనుంది. సినిమాలో రామ్‌చరణ్‌ను పరిచయం చేసే ఈ గీతం పూర్తి సాహిత్యంతో రేపు విడుదల కానుంది. ఏకంగా 1000కి పైగా జానపద కళాకారులు ఈ పాటలో రామ్‌చరణ్‌తో కలిసి డాన్స్ చేయటం విశేషం. గణేశ్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీలో తమన్ సంగీత సారథ్యంలో ఈ పాట రూపుదిద్దుకుంది.