calender_icon.png 1 November, 2024 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్లమెంట్ ఎన్నికల కోసం భారీ భద్రతా చర్యలు ఏర్పాటు : డీజీపీ రవిగుప్తా

11-05-2024 08:08:31 PM

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తం సోమవారం జరుగనున్న పార్లమెంట్ 17 స్థానాలకు, కంటోన్మెంట్ ఉపఎన్నికల కోసం కట్టదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. ఈ ఎన్నికలు సజవుగా జరిగేందుకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా డీజీపీ రవిగుప్తా మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో భద్రత విధుల్లో 73,414 సివిల్ పోలీసులు, 500 తెలంగాణ స్పెషల్ పోలీస్ బలగాలు, 164 కేంద్ర బృందాలు, తమిళనాడుకు చెందిన మూడు స్పెషల్ ఆర్మ్ ఫోర్స్, ఇతర రాష్ట్రాలకు చెందిన  7000 మంది హోంగార్డులు, 2088 మంది ఇతర శాఖల సిబ్బంది ఎన్నికల భద్రత విధుల్లో ఉంటారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా భద్రత, తనిఖీ నెట్ వర్క్ ఏర్పాటు చేశామని, నెట్ వర్క్ లో 482 ఫిక్స్ డ్ స్టాటిక్ టీమ్ లు, 462 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ లు, 89 అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు,  127 అంతర్ జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు  ఆయన వెల్లడించారు. ఎన్నికల పర్యవేక్షణ కొరకు డీజీపీ కార్యాలయంలో కేంద్రీకృత కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు.