కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): గంజాయి కేసులో ఉత్తమ నేర పరిశోధన చేపట్టి గంజాయి తరలిస్తున్న నేరస్తులకు శిక్షపడేలా కృషి చేసిన ప్రస్తుత లింగాపూర్ ఎస్సై సిహెచ్ గంగన్నకు శనివారం హైదరాబాదులో రాష్ట్ర డిజిపి జితేందర్ అభినందించి ,ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గతంలో ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసిన సమయంలో గంజాయి కేసులో ఉత్తమమైన నేర పరిశోధన చేసి గంజాయి తరలిస్తున్న నేరస్తులకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష ,లక్ష రూపాయల జరిమానా విధించేలా కృషి చేయడంతో డిజిపి నుంచి ప్రశంసలు పొందారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ మహేష్ భగవత్, పోలీసు ఉన్నతాధికారులు సందీప్ సాండిలా తదితరులు పాల్గొన్నారు.