calender_icon.png 2 February, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండగట్టు ‘అంజన్న’ సన్నిధిలో... డిజిపి ప్రత్యేక పూజలు

02-02-2025 12:00:00 AM

జగిత్యాల, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి సన్నిధిలో రాష్ర్ట డిజిపి జితేందర్ దంపతులు కుటుంబ సమేతంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు డిజిపి దంపతులకు ఆలయ సంప్రదాయం ప్రకారం మేళ తాళాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.

స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డిజిపి దంపతులను ఆలయ అర్చకులు వేదోక్త మంత్రాలతో ఆశీర్వదించారు.  స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు కొండగట్టుకు విచ్చేసిన డిజిపిని జిల్లా ఎస్పీ అశోక్’కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు.

అనంతరం పోలీస్ శాఖ లాంచన ప్రకారం సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ జిల్లా స్థితి గతులు, శాంతిభద్రతల గురించి జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యల గురించి ఎస్ప ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్, ఆర్‌ఐ కిరణ్’కుమార్, మల్యాల సిఐ రవి, ఎస్‌ఐలు సతీష్ , రవికుమార్ పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.