10 June, 2026 | 1:30 AM

ఆదిలాబాద్ పర్యటనలో డీజీపీ

10-06-2026 12:27 AM

సీవీ ఆనంద్‌కు ఘన స్వాగతం పలికిన మల్టీజోన్ వన్ ఐజీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ 

ఆదిలాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా డీజీపీ సీవీ ఆనంద్ జిల్లాకు చేరుకున్నారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రానికి వచ్చిన డీజీపీకి మల్టీజోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా ఆహ్వా నించారు.

డీజీపీతో పాటు ఉమెన్ సేఫ్టీ, సీఐడీ, ఏసీబీ డీజీ చారు సిన్హా జిల్లా పర్యటనకు వచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంతో పాటు బజార్హత్నూర్ మండలంలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జిల్లా పోలీస్ అధికారులతో క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో డీజీపీ పాల్గొననున్నారు.