calender_icon.png 2 January, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినిమాల్లో హీరోలు.. బయట మాత్రం పౌరులే: డీజీపీ

22-12-2024 02:43:40 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రముఖ సినీ నటులు అల్లు అర్జున్, మంచు మోహన్ బాబు ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. సినిమాల్లో హీరోలైనా బయట మాత్రం పౌరులే అని, క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా అర్థం తెలుసుకోవాలన్నారు. చట్టానికి లోబడి పోలీసు శాఖ పనిచేస్తుందని, తప్పు ఎవరు చేసిన కేసులు నమోదు చేస్తామని డీజీపీ మండిపడ్డారు. పౌరుల రక్షణే తమకు ప్రాధాన్యం అని, ప్రజల ప్రాణాలు, భద్రత కంటే సినిమా ప్రమోషన్ ఎక్కువేం కాదన్నారు. అల్లు అర్జున్ కు తామ వ్యతిరేకం కాదని తెలిపారు. చట్టప్రకారమే అల్లు అర్జున్ పై చర్యలు తీసుకున్నామని, సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమని డీజీపీ జీతేందర్ పరోక్ష్యంగా హితవు పలికారు. మోహన్ బాబుపైనా కేసు నమోదు చేశామని చెప్పారు. మోహన్ బాబుది వారి కుటుంబ సమస్య అని, విలేకరులపై జరిగిన దాడి దృష్ట్యా ఆయన కేసు నమోదైందని, చట్టం ప్రాకారం మోహన్ బాబుపై చర్యలు ఉంటాయని డీజీపీ వెల్లడించారు.