calender_icon.png 20 January, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో పోలీస్ అతిథి గృహం ప్రారంభించిన డిజిపి

19-01-2025 09:24:40 PM

విధి నిర్వహణ తో పాటు ఉత్తమ సేవలందించిన అధికారులకు జ్ఞాపీకలు అందజేత

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో నీకేసంపల్లి శివారులో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న పోలీస్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వద్ద నిర్మించిన పోలీస్ అతిథి గృహాన్ని ఆదివారం రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విధినిర్వణంలో ఉత్తమ సేవలందించిన పోలీస్ అధికారులకు జ్ఞాపికలను అందజేశారు. కామారెడ్డి రూరల్ సీఐ రామన్ దేవునిపల్లి ఎస్ హెచ్ ఓ రాజుల ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మల్టీ జోన్ ఐజి పి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ కామారెడ్డి జిల్లా అదనపు ఎస్పి చైతన్య రెడ్డి నరసింహారెడ్డి డిఎస్పీలు శ్రీనివాస్ సత్యనారాయణ ఎస్బి ఇన్స్పెక్టర్లు సిఐలు ఆర్ఐలు ఎస్సైలు ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.