సెన్సిబుల్ డైరెక్టర్ కె.క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఆర్తీ క్రియేటివ్ టీమ్ బ్యానర్‌పై గంటా కార్తీక్ రెడ్డి నిర్మించనున్న కొత్త ప్రాజెక్ట్‌ను శనివారం మేకర్స్ ప్రకటించారు. వాస్తవ సంఘటనలతో స్ఫూర్తి పొందిన కథతో ఈ సినిమాను దర్శకుడు క్రాంతి మాధవ్ సిద్ధం చేశారు. ఈ చిత్రానికి డీజీఎల్ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. టైటిల్ పోస్టర్లో హీరో టీ-షర్ట్‌ని వెనుక నుంచి లిఫ్ట్ చేసి డిఫరెంట్ ఫోజ్‌లో కనిపించారు.
పోస్టర్లో జర్నీ బిగిన్స్ అని రాసుంది. కాజీపేట జంక్షన్‌లోని రైల్వే ట్రాక్‌పై నిలబడి ఉండగా, అతని చుట్టూ వివిధ ట్రాక్‌లపై రైళ్లు వెళ్తున్నాయి. టీమ్ విడుదల చేసిన మరో పోస్టర్లో స్నేహితుల గ్యాంగ్ రైల్వే బ్రిడ్జిపైన ఎంజాయ్ చేస్తున్నట్టు ప్రజెంట్ చేస్తోంది. ఈ రెండు పోస్టర్లు సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచాయి.
నవంబర్ 2024లో డీజీఎల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. దర్శకుడు క్రాంతి మాధవ్ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ తర్వాత కెమెరామెన్ జ్ఞానశేఖర్తో కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన తారాగణంతో పాటు ఇతర టెక్నీషియన్స్‌ల వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ ప్రకటించారు.