calender_icon.png 9 January, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైళ్ల శాఖ వార్షిక నివేదిక విడుదల

08-01-2025 02:21:21 PM

హైదరాబాద్: తెలంగాణ జైళ్ల వార్షిక నివేదికను డీజీ సౌమ్య మిశ్రా(DG Soumya Mishra) బుధవారం విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. 2024లో 41,138 మంది ఖైదీలు జైళ్లలో ఉన్నారని డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. 2024లో హత్య కేసుల్లో 2,754 మంది శిక్ష అనుభవిస్తున్నారని వెల్లడించారు. 2024లో ఫోక్సో కేసులో 3,655 మంది పురుషులు, 94 మంది మహిళలు జైలులో ఉన్నారు. 2024లో ఎన్ డీపీఎస్ కేసులో 5,999 మంది పురుషులు, 312 మంది మహిళలు జైళ్లలో ఉన్నారని పేర్కొన్నారు. 2024లో 1,045 మంది ఖైదీలకు ఉచిత న్యాయ సలహా సేవలు అందాయని వెల్లడించారు. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్(Film actor Allu Arjun) విడుదల కు సంబంధించి జైళ్ల శాఖలో ఎలాంటి లోపం లేదని వెల్లడించారు. చట్ట ప్రకారమే అల్లు అర్జున్ ను విడుదల చేశామని డీజీ సౌమ్యమిశ్రా సూచించారు. 2023లో 31,428 మంది ఖైదీలు జైళ్లలో ఉన్నారని ఆమె తెలిపారు. హత్య కేసుల్లో 2,501 శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. ఫోక్సో కేసుల్లో 2,846 మంది పురుషులు, 59 మహిళలకు శిక్ష పడింది జైళ్లశాఖ డీజీ తెలిపారు. 30 ఏళ్ల లోపువారు 12,132 మంది పురుషులు, 359 మంది మహిళలున్నారు. 2023 లో కోర్టు విచారణలో 20,717 కేసులున్నాయని జైళ్లశాఖ డీజీ  సౌమ్య మిశ్రా ప్రకటించారు.