calender_icon.png 28 December, 2024 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఎఫ్‌వోను సస్పెండ్ చేయాలి

05-11-2024 01:26:46 AM

ఎమ్మెల్యే హరీశ్‌బాబు 

అటవీశాఖ అధికారుల తీరుపై నిరహార దీక్ష

కుమ్రంభీంఆసిఫాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): స్థానిక డీఎఫ్‌వో జిల్లాలోని అటవీశాఖలో మాఫియా డాన్‌గా వ్యవహరిస్తున్నాడని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ఆరోపించారు. అటవీశాఖ అధికారుల వ్యవహార తీరుపై సిర్పూర్(టి) మండల కేంద్రం లోని రేంజ్ కార్యాలయం ఎదుట సోమవారం ఆయన నిరహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల బెంగాలీ క్యాంపునకు చెందిన రైతులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి వారిని చిత్రహింసలకు గురిచేసిన రేంజర్, సెక్షన్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశా రు.

రేంజ్‌లో అడ్డగోలు అవినీతి, అక్రమాల కు పాల్పడుతున్న అధికారులను కాపాడు తూ వారి నుంచి నెలవారీగా డీఎఫ్‌ఓ మాముళ్లు వసూలు చేస్తున్నారని పాల్వాయి ఆరోపించారు. నియోజవర్గంలో జరుగుతు న్న అవినీతి, అక్రమాలపై ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌కు, అటవీశాఖ మంత్రికి ఫిర్యాదు చేసి నట్లు వివరించారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ (కాంపా) నిధులను డీఎఫ్‌ఓ దుర్వినియోగం చేశారన్నారు. వాటిపై సీబీఐ విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే దీక్షకు బీజేపీ శ్రేణులు మద్దతుగా నిలిచారు.