వనపర్తి టౌన్ ఫిబ్రవరి 3: ఫిబ్రవరి 10న నిర్వహించే జాతీయ నులిపురుగుల నివార ణ దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహిం చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి 1-19 ఏళ్ళ వయసున్న పిల్లల్లో అనారోగ్యానికి, రక్తహీనతకు కారణమయ్యే నులిపురుగుల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఫిబ్రవరి 10న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని పుర స్కరించుకొని సోమవారం కలెక్ట రేట్‌లోని ప్రజావాణి హాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, 1 నుంచి 19 సంవ త్సరాల వయస్సు గల ప్రతి ఒక్కరికీ ఆల్బెండ జోల్ మాత్రలు తినిపించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని అ న్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఆల్బెండ జోల్ మాత్రలు పంపిణీ చేయాలని, ఫిబ్రవ రి 10న అటెండెన్స్ సమయంలోనే విద్యార్థు లకు ఈ మాత్రలు తినిపించేలా చర్యలు తీసు కోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు.
అవసరమైన మాత్రలు అన్ని పాఠశాలలు, కళాశాలలో, హాస్టల్, గురుకు ల, కే.జి.బి.వి ల్లో మరియు అంగన్వాడి కేం ద్రాలకు అందించే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జీ వెంకటేశ్వర్లు, ఆర్డివో సుబ్రహ్మణ్యం, జడ్పీ సీఈఓ యాదయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సాయినాథ్ రెడ్డి, పరిమళ, ఇతర శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.