calender_icon.png 27 February, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్మోగిన శివనామస్మరణ

27-02-2025 12:56:03 AM

ఉమ్మడి వరంగల్‌లో ఘనంగా శివరాత్రి వేడుకలు భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు

జనగామ, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : మహాశివరాత్రి పురస్కరించుకొని బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ప్రముఖ శైవక్షేత్రాలైన పాలకుర్తి సోమేశ్వరాలయం, బచ్చన్నపేటలోని కొడవటూరు సిద్దేశ్వర ఆలయంలో శివకళ్యాణం నిర్వహించగా భక్తులు తరలివెళ్లారు.

వరంగల్లోని వేయిస్తంభాల ఆలయంలో ఎంపీ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ అర్చన చేశారు. లింగాల ఘన్పూర్‌లోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలకుర్తి సోమేశ్వర స్వామిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.