calender_icon.png 17 January, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవభక్తి సన్మార్గంలో నడిపిస్తుంది : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

25-08-2024 02:24:49 PM

మహబూబ్ నగర్ : పోచమ్మ తల్లి ఆశీస్సులతో సంతోషంగా జీవిద్దమని దైవభక్తి సన్మార్గంలో నడిపిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని మూడవ వార్డు ఏనుగొండ లో  శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో  ముఖ్య అతిథిగా పాల్గొని పోచమ్మ తల్లి కి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... అమ్మవారి కృప కటాక్షాలు మనందరిపై ఉండాలని, సుఖసంతోషాలతో ప్రజలంతా జీవించాలని ఆయన ఆకాంక్షించారు.  అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆలయ  కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, రామస్వామి , కొత్త కిరణ్ , యాదయ్య, శ్రీను, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు