calender_icon.png 20 April, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంప్రోక్షణ జలాల కోసం పరితపించిన భక్తులు

08-04-2025 12:00:00 AM

భద్రాచలం, ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : భక్తుల మీద చల్లాల్సిన సంప్రోక్షణ జలాలను ఆచారానికి విరుద్ధంగా కొంతమంది అర్చకులు బాటిల్స్ లో నింపడంపై భక్తులు ఆగ్ర హం వ్యక్తం చేశారు.భద్రాచలం మిథిలా స్టేడియంలో సోమవారం అత్యంత వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. రాష్ట్ర గవర్నర్ తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్లమెంటు సభ్యు లు బలరాం నాయక్ శాసనసభ్యులు తెల్ల వెంకటరావు పాటు పలువురు అధికార అనధికారులతోపాటు పెద్ద ఎత్తున భక్తులు పా ల్గొన్నారు.

అయితే పట్టాభిషేకం వైభవంగా జరిగినప్పటికీ పట్టాభిషేకం అనంతరం నాలుగు సముద్రాలు, ఎనిమిది నదుల నుంచి తీసుకొచ్చిన జలాలతో పట్టాభి శక్తుడైన స్వామివారిని సంప్రోక్షణ చేసి అనం తరం ఆ జలాలను వచ్చిన అతిథులతో పా టు పట్టాభిషేకం తిలకించిన  భక్తులందరిపై చిలకరిస్తారు. సంప్రోక్షణ జలాలు మీద పడితే భద్రాద్రి రామయ్య ఆశీస్సులతో అం తా మంచే జరుగుతుందని భావన, భక్తుల ప్రగాఢంగా విశ్వాసం.

అందుకే ఈ సంప్రోక్షణ జనాల కోసం పట్టాభిషేకం పూర్తయిన వివిధ సెక్టార్ లో ఉండి భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. అంతే కాకుండా అక్కడే ఉన్న దేవస్థానం ఈవో కి జరిగిన విషయం తెలియజేయడంతో, ఆమె జరిగిన పొరపాటును తెలుసుకొని వెంటనే సరిదిద్దే ప్రయ త్నం చేశారు. అప్పటికే నిరాశ చెందిన సెక్టర్లలోని భక్తులు దాదాపుగా వెళ్లిపోయారు. కొంతమందికి మాత్రమే సంప్రోక్షణ జలాలు అందాయి. అయితే ఈ విషయం ఎండోమెంట్ కమిషనర్ శ్రీధర్ దృష్టికి కొంత మంది తీసుకువెళ్లగా దీనిపై విచారణ జరిపిస్తానని  హామీ ఇచ్చారు.