బారాబంకి: ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్(Prayagraj Maha Kumbh)కు వెళ్లి తిరిగి వస్తున్న భక్తులతో వెళ్తున్న పిక్-అప్ వ్యాన్ ఇక్కడి సఫ్దర్‌గంజ్ ప్రాంతంలో బోల్తా పడడంతో పది మంది గాయపడినట్లు పోలీసులు శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం సఫ్దర్‌గంజ్ పోలీస్ స్టేషన్(Safdarganj Police Station) పరిధిలోని మౌలాబాద్ గ్రామ సమీపంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. 10 మందిలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారు సిరౌలి గౌస్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారని పోలీసులు తెలిపారు.