calender_icon.png 24 December, 2024 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాగ్యలక్ష్మి అమ్మవారికి భక్తుల పూజలు

02-11-2024 02:29:27 AM

వెండి నాణేలు పంపిణీ చేసిన ఆలయ కమిటీ 

చార్మినార్, నవంబర్ 1: దీపావళిని పురస్కరించుకొని గురువారం పాతబస్తీలోని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది మాదిరిగానే అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు వెండి నాణేలు పంపిణీ చేశారు.

దీంతో భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఏడాది అంత భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకలతో వెండి నాణేలను తయారు చేసి పండుగ రోజు పంపి ణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వెండి నాణెంపై ఓ వైపు అమ్మవారి ప్రతిమ, మరోవైపు చార్మినార్‌ను ముద్రించారు.