calender_icon.png 5 February, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ణంపల్లి రేణుక ఎల్లమ్మను దర్శించుకున్న భక్తులు

30-01-2025 12:00:00 AM

చేగుంట, జనవరి 29 : పవిత్ర పుణ్య క్షేత్రం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మాఘ అమా వాస్య జాతరకు భక్తజనం పోటెత్తారు. మాఘ అమావాస్య పురస్కరించుకొని శ్రీ రేణుక అమ్మ వారిని  వివిధ రూపాలలో మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సౌకర్యా ల కోసం ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దగ్గర ఎలాం టి అవాంఛనీయ సంఘట న జరగకుండా చేగుంట ఎస్ ఐ శ్రీచైతన్య కుమార్ రెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మాఘ అమావాస్య పురస్కరించుకొని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్‌రెడ్డి, శ్రీరేణుక భవానిమాత అమ్మవారిని దర్శించు కున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికా రు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు నాయకులకు శాలువ కప్పి సత్కరించారు.

మంజీరానదిలో భక్తుల పుణ్యస్నానాలు 

ఆందోల్ జనవరి 29 : మాఘ అమావాస్యను  పురస్కరించుకొని జోగిపేట సమీపంలోని చిట్కుల చాముండేశ్వరి ఆల యం వద్ద భక్తులు పోటెత్తారు. ఈ సంద ర్భంగా ఆలయ సమీపంలో ఉన్న మంజీరా  నదిలో భక్తులు  పుణ్యస్నానాలు చేశారు. ఈ ప్రాంతంలో పవిత్ర ఆలయంగా భావిం చే చాముండేశ్వరి ఆలయంలో స్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనం చేసుకున్నా రు. ఈ ప్రాంతంలోని మంజీ రా తీరంలో స్నాన ఘట్టాలు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.