ఒక్క రోజు సింగరాయ జాతర మూడు రోజులు కూడవెల్లి, పుల్లూరు జాతరలు
సిద్దిపేట/ హుస్నాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): మాఘమాసం పురస్కరిం చుకొని సిద్దిపేట జిల్లాలో అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి జాతరలు బుధవారం ప్రారంభమయ్యాయి. హుస్నా బాద్ ప్రాంతంలోని సింగరాయలొద్దిలో ఒకేరోజు స్నానాలు ఆచరించి స్వయంగా వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించు కుని మొక్కులు చెల్లించుకుంటారు.
సిద్దిపే ట పరిధిలోని పుల్లూరు బండపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి, దుబ్బాక ప్రాంతం లోని కూడవెళ్లి గ్రామ శివారు నగల వాగుని ఆనుకొని వెలసిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలలో మూడు రోజులపా టు ఉత్సవాలు జరుగుతాయి.
మాఘ అ మావాస్య పుణ్యస్నానాలు ఆచరించి మొ క్కులు చెల్లించుకుని లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం చేస్తాడని భక్తుల నమ్మ కం. బుధవారం జిల్లాలోని లక్ష్మీ నరసింహ ఆలయాలలో జరిగిన జాతర ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జనసంద్రమైన సింగరాయలొద్ది...
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూ రెల్ల, తంగళ్లపల్లి నడుమ ఉన్న సింగరాయ లొద్ది జనసంద్రంగా మారింది. ప్రతి ఏటా మాఘ అమావాస్య నాడు ఇక్కడ జరిగే సింగరాయ జాతరకు ఈసారి కూడా జనం పోటెత్తారు.
సిద్దిపేట జిల్లాలోని వివిధ ప్రాం తాలతోపాటు హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచీ, పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ర్ట నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఇక్కడి మోయతుమ్మెదవాగులో స్నానాలు చేశారు.
గుట్టమీద బండసొరికెలో ఉన్న నరసింహస్వామిని దర్శించుకుని మొక్కు లు చెల్లించుకున్నారు. వాగు చెలిమల నుం చి తీసిన నీటితో వంకాయకూర, చింతపం డు చారు చేసి స్వామికి నైవేద్యం పెట్టారు.