10-03-2025 12:28:29 AM
గజ్వేల్, మార్చి 9 : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచగిరి లక్ష్మీ నరసింహుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. హరిద్రా నదిలో, క్షేత్రంలోని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి విశేష సంఖ్యలో లక్ష్మీ నరసింహ స్వామిని భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.