20-03-2025 12:18:47 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పాపన్నపేట, మార్చి 19:ప్రఖ్యాతి గాంచిన ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని మాత దర్శనానికి వచ్చే భక్తులకు ఎండ వల్ల ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. బుధవారం ఆయన ఏడుపాయల అమ్మవారి ఆలయ పరిసరాలను అధికారులతో కలిసి తిరిగి పరిశీలించారు.
అమ్మవారిని దర్శించు కునేందుకు జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేకమంది భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారని తెలిపారు. వేసవి కాలంలో ఎండ నుండి ఎలాంటి ఇబ్బందులు భక్తులకు కలగకుండా సౌకర్యవంతంగా అమ్మవారిని దర్శనం చేసుకునేందుకుగాను అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాజగోపురం నుండి అమ్మవారి ఆలయం వరకు భక్తులకు ఎండ నుండి ఉపశమనం కలిగించేందుకుగాను చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. రానున్న వేసవిలో భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు.
అలాగే చలువ పందిళ్లను వేగవంతంగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల తహసిల్దార్ సతీష్, ఆలయ ప్రధాన పూజారి శంకర్, మండల ఆర్.ఐ నాగరాజుతో పాటు ఇతర అధికారులు, ఆలయ సిబ్బందిఉన్నారు.