calender_icon.png 6 February, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

06-02-2025 12:36:39 AM

ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి 

మేడ్చల్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అధికారులకు సూచించారు.

బుధవారం కలెక్టరేట్ లోని వీసీ హాలులో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 26న మహాశివరాత్రిని పురస్కరించుకొని దైవదర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.

వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈనెల 24 నుంచి మార్చి 1వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు.

ఇందుకు అవసరమైన నిధులు ముఖ్యమంత్రితో మాట్లాడి మంజూరు చేయిస్తానన్నారు. దైవదర్శనానికి ఏర్పాటు చేసే ఆరు క్యూ లైన్ లలో మూడు సామాన్య భక్తులకు ఏర్పాటు చేయాలని, దర్శన టికెట్లు ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంచాలని ఆలయ అధికారులను కలెక్టర్ గౌతం ఆదేశించారు.

ఈ సమావేశంలో డిసిపి పద్మజ, అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, విజయేందర్ రెడ్డి, డిఆర్‌ఓ హరిప్రియ, కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి, ఆలయ చైర్మన్ నారాయణ శర్మ, ఈవో సుధాకర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.