calender_icon.png 4 February, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓనమాల తల్లి దర్శనానికి భక్తుల క్యూ

04-02-2025 12:00:00 AM

  1. వర్గల్ క్షేత్రంలో ఘనంగా వసంత పంచమి
  2. పది వేల మందికిపైగా చిన్నారులకు అక్షరాభ్యాసాలు 
  3. 5౦ వేల మందికిపైగా హాజరైన భక్తజనం 

గజ్వేల్, ఫిబ్రవరి 3 : చదువుల తల్లి ఒడిలో ఓనమాలు దిద్దడానికి వచ్చిన భక్తులతో వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రం జనసంద్రంగా మారింది.  సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని విద్యా సరస్వ తి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.

వసంత పంచమి మహోత్సవాన్ని పురస్కరించుకొని క్షేత్రమంతా అమ్మ వారి నామస్మరణతో మారుమోగగా, తెల్లవారుజామున శ్రీవిద్యా సరస్వతి అమ్మ వారికి వేదమూర్తులైన బ్రాహ్మణోత్తముల మంత్రోశ్చరణల మధ్య ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ యా యవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి శ్రీ పంచమి వేడుకలకు అంకురార్పణ చేశారు. 

అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, పల్లకి సేవ, లక్ష పుష్పార్చన, చప్పన్ బోగ్ నివేదన  తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.  50వేల మంది కి పైగా భక్తులు తరలి రాగా, పదివేలకు పైగా అక్షరాభ్యాసాలు జరిగినట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.

ముఖ్యంగా ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేయగా, రెండు రోజులపాటు ఆలయ సముదాయం భక్తులతో కిటకిట లాడింది. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తూంకుం ట నర్సారెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాగా విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు మహాప్రసాదం అందజేశారు.

ఘనంగా వసంత పంచమి వేడుకలు 

సంగారెడ్డి, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి): వసంత పంచమి వేడుకలు భక్తు లు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సోమ వారం సంగారెడ్డి జిల్లాలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాల యాల్లో ప్రత్యేక పూజలు చేసి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. న్యాల్కల్ మం డలంలోని రాఘవపూర్ శివారులో ఉన్న పంచవటి క్షేత్రంలో వసంత పంచమి వేడు కలు ఘనంగా నిర్వహించారు.

మంజీరా నదిలో భక్తులు స్నానాలు చేసి సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులకు సరస్వతి దేవి ఆలయంలో అక్షర శ్రీకారం చేయించారు. వేద పండి తులు ప్రత్యేక పూజలు చేసి చిన్నారులకు అక్షర అభ్యాసం చేయించారు.

భక్తులు ఉదయం నుంచి దేవాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు గంగమ్మ తల్లికి నైవిద్యం సమర్పించారు. అమ్మ వారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

విద్యతోపాటు సంస్కారం నేర్పించేవే శిశుమందిరాలు..

రామాయంపేట, ఫిబ్రవరి 3 : రామాయంపేట పట్టణంలోని అశోక్ సింగల్ సరస్వతి శిశు మందిర్‌లో సోమవా రం వసంత పంచమి ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా సరస్వతి మాతకు ప్రత్యేక పూజ కార్యక్రమం చేయడంతో పాటు సామూహిక అక్షరాభ్యాసం కార్య క్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

విద్యాపీఠం ఆధ్వర్యంలో సరస్వతి శిశు మందిర్ 1972 నుండి చిన్నారులకు విద్యార్థులకు ఆత్మీయ ఆధ్యాత్మిక మానసిక వికాసం కోసం కృషి చేస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజల ఆచార్యులు12 వేల శిశు మందిరం లో విద్యార్థులకు విద్యనందిస్తున్నట్లుగానే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజల ఆచార్యులు కవిత, పండరినాథ్ తదిరులు పాల్గొన్నారు.