భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో నిర్వహిస్తున్న, ముక్కోటి ఉత్సవాల్లోగా భాగంగా, రెండవ రోజైన బుధవారం శ్రీ సీతారామచంద్రస్వామి కూర్మావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఒకవైపు నూతన సంవత్సరం ప్రారంభం కావడం, మరోవైపు ముక్కోటి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రామాలయంలో భక్తుల తాకిడి అధిక మైంది.