calender_icon.png 27 February, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న క్షేత్రానికి తరలొస్తున్న భక్తులు

27-02-2025 01:13:21 AM

చేర్యాల, ఫిబ్రవరి 26:  కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద పట్నం వేడుకకు భక్తులు భారీగా తరిలోస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టాలలో ఒకటైన పెద్దపట్నం కత్రువు బుధవారం రాత్రి ప్రారంభమై వేకువ జాము వరకు  కొనసాగు తుంది. పరసర  గ్రామాల వారు ఉపవాసాలు ఉండి, జాగారం కోసం తరలి వస్తారు. మల్లన్న సన్నిధిలో జాగారం చేస్తే మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

అదేవిధంగా రాష్ట్రం నలుమూలల నుంచి కాక, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ప్రత్యేకంగా పెద్దపట్నం వేడుక చూడడానికి మల్లన్న క్షేత్రానికి వస్తారు. భక్తులు, శివసత్తులు వేడుకను తెల్లవార్లూ ఓపికతో చూసి, పట్నం దాటి మరోసారి స్వామిని దర్శనం చేసుకొని, వారి వారి గమ్యస్థానాలకు చేరుకుంటారు. పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు రాత్రంతా జాగారం చేసి ఉదయం స్వామివారి కోనేట్లో స్నానాలు ఆచరించి, స్వామి  వారిని దర్శించుకుని ఒక్కపొద్దులను వదులుతారు.

అనంతరం వారి వారి గ్రామాలకు పోతారు. మహారాష్ట్ర నుంచి శివరాత్రి పర్వదినం సందర్భంగా మల్లన్న క్షేత్రానికి భక్తులు తరలి వస్తారు. మూడు రోజులపాటు ఇక్కడే బస చేస్తారు. సుమారు ఐదారు వందల మంది భక్తులు ఖాళీ స్థలాలో విడిది చేస్తారు. మూడు రోజులపాటు వివిధ భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అందులో భాగంగా చివరి రోజు  భక్తులు అంతా కలిసి ఒకేసారి ఊరేగింపుగా మల్లన్న దర్శనానికి వెళ్తారు. దర్శనానంతరం విడిది చేసిన ప్రాంతంలోనే  తల కొన్ని బియ్యం సేకరించి, అలా సేకరించిన బియ్యాం తో శాకాహార  వంటలు చేసి సంపక్తి భోజనం చేస్తారు. సాయంత్రం ఆలయానికి రెండు మూడు కిలోమీటర్లు దూరంగా వెళ్లి అక్కడ మాంసాహారం భుజించి, ఆ రాత్రి తిరిగి ప్రయాణం అవుతారు.  పెద్దపట్నం వేడుక జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.