యాదాద్రి భువనగిరి, జూలై 14 (విజయక్రాంతి): యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సన్నిధికి ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం తరలివచ్చిన భక్తులతో ఆలయ తిరువీధులు కిక్కిరిసిపోయాయి. ధర్మదర్శనానికి దాదాపు 3 గంటల పాటు భక్తులు క్యూ లైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. స్వామివారి నిత్య హోమ, కల్యాణోత్స వాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం లక్ష్మీనరసింహుల వెండి జోడి సేవ సంప్రదాయరీతిలో నిర్వహించారు. స్వామివారికి ఆదివారం వివిధ కైంకర్యాల ద్వారా రూ.45.68 లక్షల ఆదాయం సమకూరినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ భాస్కర్‌రావు తెలిపారు.