calender_icon.png 14 November, 2024 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుట్టకు పోటెత్తిన భక్తులు

11-11-2024 01:02:36 AM

యాదాద్రిభువనగిరి, నవంబర్ 10 (విజయక్రాంతి) : వరుస సెలవులు రావడంతో యాదగిరిగుట్టకు ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వయంభూ లక్ష్మీనరసింహుల సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. మాఢవీధుల్లో మహిళలు కార్తీక దీపారాదనలు, సత్యనారాయణ వ్రతాలు పెద్దసంఖ్యలో ఆచరించారు.  వేకువజాము నుంచే పుష్కరిణిలో పుణ్యస్నానాలు భక్తులు ఆచరించి కార్తీకమాస దీపాలు వెలిగించారు. లక్ష్మీనృసింహుడి దర్శనానికి  నాలుగు గంటల సమయం పట్టింది.