calender_icon.png 4 January, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనదుర్గ దర్శనానికి పోటెత్తిన భక్తులు

01-01-2025 05:54:46 PM

పాపన్నపేట: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చిన భక్తులతో ఏడుపాయల వనదుర్గ భవానీ దేవస్థానం కిటకిటలాడింది. బుధవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే దుర్గామాతను పట్టు చీర, వివిధ రకాల పూలతో ముస్తాబు చేసి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. పవిత్ర మంజీరా నదీపాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే అమ్మవారికి తలనీలాలు, ఒడిబియ్యం, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్ళు, శివసత్తుల ఆటలతో దేవస్థానం పరిసరాలు మారుమ్రోగాయి. నూతన సంవత్సరం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దర్శనానికి సమయం పట్టింది. దేవస్థానం ఈఓ చంద్రశేఖర్, సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. స్థానిక పోలీసులు బందోబస్తు చేపట్టారు.