పాపన్నపేట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గా మాత దేవస్థానం పరిసరాలు ఆదివారం భక్తులతో నిండిపోయాయి. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి మంజీరా నదీ పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లికి భక్తులు ఒడిబియ్యం, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు.