జహీరాబాద్, ఫిబ్రవరి 2 : వసంత పంచమి పురస్కరించుకొని భక్తులు పంచవటిలో స్నానాలు ఆచరించి అక్కడే ఉన్న సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు ఆదివారం నాడు న్యాల్కల్ మండలం రాఘవపూర్ లో కొలువైన సరస్వతి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాద స్వీకరించారు తెల్లవారుజాముని వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి తమ పిల్లాపాపలతో కలిసి దర్శించుకొని అక్షరాభ్యాసం నిర్వహించారు.
ఆలయం ముందు ఉదయాన్నే అమ్మవారికి కుంకుమార్చన అభిషేకాలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో భజన సంకీర్తన నిర్వహించారు. తెల్లవారుజామున నగర సంకీర్తన నిర్వహించి అమ్మవారికి మొక్కులు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఝరాసంగం న్యాల్కల్ మగడంపల్లి మండల ప్రజలు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు భక్తుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయం తరఫున ఏర్పాటు చేశారు